తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఏందయ్యా ఇది.. కాలనీ మొత్తం బిల్లు నాకేనా! - ఐపీఎల్ వార్తలు

ఇటీవల కాలంలో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ షాకిస్తోంది కరెంట్ బిల్. తాజాగా టీమ్​ఇండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా తనకొచ్చిన బిల్లు చూసి షాకయ్యాడు. చుట్టు పక్కల వారి బిల్లు కూడా తనకే ఇచ్చారా అంటూ నిలదీశాడు.

ఏందయ్యా ఇది.. చుట్టుపక్కల వారి బిల్లు కూడా నాకేనా!
ఏందయ్యా ఇది.. చుట్టుపక్కల వారి బిల్లు కూడా నాకేనా!

By

Published : Jul 27, 2020, 4:47 PM IST

Updated : Jul 27, 2020, 5:29 PM IST

తనకొచ్చిన కరెంటు బిల్లు చూసి టీమ్‌ఇండియా వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ అవాక్కయ్యాడు. సహజంగా తాను కట్టేదాని కన్నా ఏడింతలు ఎక్కువ వచ్చిందని చెప్పాడు. ముంబయి అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థ నుంచి ఇటీవల తనకు వచ్చిన మెసేజ్‌ను భజ్జీ ట్విట్టర్​లో పోస్టు చేశాడు. అందులో చుట్టుపక్కల వాళ్లందరి బిల్లు కూడా తనకే ఇచ్చారా అంటూ ఆ సంస్థను నిలదీశాడు. ఈ నెల మొత్తం రూ.33,900 బాకీ ఉన్నట్లు తనకు వచ్చిన మెసేజ్‌ను చూపించాడు.

ఇటీవల కాలంలో ఇలా కరెంట్‌ బిల్లులు అధిక మొత్తంలో రావడం సాధారణం అయిపోయింది. ఇంతకుముందు బాలీవుడ్‌ నటి తాప్సీ కూడా తనకు రూ.36 వేలు వచ్చిందని, ఇప్పుడా ఇంట్లో ఎవరూ ఉండరని పేర్కొంది. లాక్‌డౌన్‌ వేళ హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటనలు చవిచూశాయి. సామాన్య జనాలకు దిమ్మతిరిగే కరెంట్‌ బిల్లులు వచ్చాయి.

లాక్‌డౌన్‌ కారణంగా ఇన్ని రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకున్న హర్భజన్‌ త్వరలోనే యూఏఈకి పయనమయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి ఆరంభమవుతుండగా, అన్ని ఫ్రాంఛైజీల కన్నా ముందే చెన్నై సూపర్‌ కింగ్స్‌ అక్కడికి చేరుకోనుంది. మార్చిలో కూడా ఆ జట్టు అన్ని జట్ల కన్నా ముందే శిక్షణా శిబిరం నిర్వహించింది.

Last Updated : Jul 27, 2020, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details