ఐపీఎల్లో భాగంగా ఏడు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్నాడు సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఆ తర్వాత ప్రాక్టీసుకు వెళ్తూ, బాంగ్రా స్టెప్పులేస్తూ కనిపించాడు. చెన్నై సూపర్‌కింగ్స్ ఇతడిని వదులుకోగా, ఫిబ్రవరిలో జరిగిన వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రూ.2 కోట్ల కనీస ధరకు భజ్జీని సొంతం చేసుకుంది.
బాంగ్రా డ్యాన్స్ చేస్తూ ప్రాక్టీసుకు హర్భజన్ - IPL LATEST NEWS
ఐపీఎల్ క్వారంటైన్ పూర్తి చేసుకున్న హర్భజన్.. తన జట్టు కోల్‌కతాతో కలిసి ప్రాక్టీసు చేశాడు. అయితే ప్రాక్టీసుకు వచ్చే క్రమంలో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు.

"కోల్‌కతా గురించి మాట్లాడితే నాకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ ఊరు నన్ను 2001లోకి తీసుకెళ్తుంది. ఆస్ట్రేలియాతో అప్పుడు జరిగిన మ్యాచ్‌లో ఫామ్‌లో లేకపోయినప్పటికీ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాను. ఎప్పుడైనా అక్కడికి వెళ్తే నా ఫామ్ తిరిగొస్తుంది. దాని అంతటికీ కారణం కాళీ మాత ఆశీస్సులే. అందుకే కోల్‌కతా నాకు రెండో ఇల్లు లాంటిది" అని హర్భజన్ చెప్పాడు.
కోల్‌కతా నైట్‌రైడర్స్.. ఏప్రిల్ 11న జరిగే తన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. మరి ఈ సీజన్లో హర్భజన్ సింగ్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి?