ఇటీవల ఇండియా-ఏ తరఫున ఓ డబుల్ సెంచరీతో పాటు సెంచరీ చేసి సత్తాచాటిన శుభ్‌మన్ గిల్‌కు టెస్టు అరంగేట్రం చేసే సమయం వచ్చిందని అన్నాడు హర్భజన్ సింగ్. న్యూజిలాండ్‌తో 21న ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో గిల్‌ను ఓపెనర్‌గా బరిలోకి దించాలని సూచించాడు. 16 నెలల తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న పృథ్వీ షా కూడా ఓపెనర్‌గా పోటీలో ఉన్నాడు. దీనిపై స్పందించాడు భజ్జీ.
"మొదటి టెస్టులో శుభ్‌మన్‌ను ఆడించాలి. ఇప్పటివరకు ఒక్క టెస్టు ఆడకపోయినా అతడిని ఓపెనర్‌గా బరిలో దించడం మంచిదే. మూడు వన్డేల్లో విఫలమైనంత మాత్రాన మయాంక్ అగర్వాల్ ప్రతిభను తక్కువ అంచనా వేయలేం. ఈ సిరీస్‌లో మయాంక్, శుభమన్ ఓపెనింగ్ చేస్తారని భావిస్తున్నా."