తెలంగాణ

telangana

ETV Bharat / sports

'హండ్రెడ్​ లీగ్​ కన్నా ఐపీఎల్​ అత్యుత్తమం'

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​)లోనే ఆడతానని స్పష్టం చేశాడు భారత క్రికెటర్​ హర్భజన్​ సింగ్​. ఇంగ్లాండ్​ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న 'ద హండ్రెడ్‌' లీగ్‌  నుంచి పేరు ఉపహరించుకోనున్నట్లు తెలిపాడు.

By

Published : Oct 5, 2019, 8:08 PM IST

హండ్రెడ్​ లీగ్​ కన్నా ఐపీఎల్​ అత్యుత్తమం​: హర్భజన్​

వచ్చే ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్​)లో తాను చెన్నై సూపర్‌కింగ్స్‌కే ఆడతానని సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ స్పష్టం చేశాడు. బ్రిటన్‌లో జరగనున్న 'ద హండ్రెడ్‌' లీగ్‌ డ్రాఫ్ట్‌ నుంచి తన పేరును ఉపసంహరించుకోనున్నట్లు తెలిపాడు. ఈ డ్రాఫ్ట్‌లో తన పేరు ఉండడం చర్చనీయాంశమైన నేపథ్యంలో భజ్జీ స్పందించాడు.

" ఐపీఎల్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌కే నా తొలి ప్రాధాన్యత. చెన్నై తరఫున రెండు మంచి సీజన్లు ఆడా. ఆ రెండు సార్లు మేం ఫైనల్‌కు వెళ్లాం. ఇప్పుడు మూడో సీజన్‌పై దృష్టిపెట్టా. బీసీసీఐ నిబంధనలను నేను గౌరవిస్తా. నేనెప్పుడూ నిబంధనలను ఉల్లంఘించలేదు. డ్రాఫ్ట్‌ నుంచి నా పేరును ఉపసంహరించుకుంటా. అయితే హండ్రెడ్‌ లీగ్‌ మంచి టోర్నీగానే భావిస్తున్నా".
-- హర్భజన్‌ సింగ్‌, భారత క్రికెటర్​

అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్‌ ప్రకటించని భజ్జీ... 2020లో నిర్వహించే హండ్రెడ్‌ లీగ్‌లో ఆడేందుకు తన కనీస ధరను లక్ష పౌండ్లుగా నిర్ణయించాడు. అయితే ఇందులో ఆడేందుకు బీసీసీఐ నిబంధనలు అనుమతించలేదు. డ్రాఫ్ట్​లో పేరు రాగానే భారత క్రికెట్​ బోర్డు ఘాటుగానే స్పందించింది. ఆటగాడు రాజీనామా చేయకుండా ఆడే నిర్ణయం తీసుకుంటే చర్యలు తప్పవని హర్భజన్​ను పరోక్షంగా హెచ్చరించింది. బోర్డు ఆదేశాలకు తలొగ్గిన భజ్జీ తన నిర్ణయం మార్చుకున్నాడు.

2016 ఆసియాకప్‌లో చివరిసారి ఆడిన భజ్జీ తర్వాత జాతీయ జట్టులో అవకాశాలు పొందలేకపోయాడు. గత రెండేళ్లుగా ఐపీఎల్‌లోనే ఆడుతున్న హర్భజన్​... ఈ ఏడాది 16 వికెట్లు తీశాడు. మొత్తం 150 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా తరఫున అత్యధికంగా టెస్టుల్లో 417 వికెట్లు తీసిన హర్భజన్​... వన్డేల్లో 260 వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా నిలిచాడు.

100 బంతుల ఆట...
'ది హండ్రెడ్‌' అనేది వంద బంతుల క్రికెట్‌ లీగ్‌. ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు ఈ టోర్నీని నిర్వహిస్తోంది. 2020 జులైలో ఈ టోర్నీ తొలి సీజన్‌ ఆరంభంకానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు పాల్గొంటుండగా, ప్రతీ జట్టుకు ముగ్గురు మాత్రమే విదేశీ ఆటగాళ్లను అనుమతించారు.

ABOUT THE AUTHOR

...view details