భారతక్రికెట్ మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ టీమిండియా నాలుగో స్థానంలో ఏ బ్యాట్స్‌మెన్ అవసరం లేదని అన్నాడు. భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన ట్వీట్‌కు యువరాజ్ ఈ విధంగా ఫన్నీ సమాధానమిచ్చాడు. వన్డేల్లో నాలుగో స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని భజ్జీ అభిప్రాయపడ్డాడు.
"వన్డేల్లో నాలుగో స్థానంలో సంజూ శాంసన్‌కు ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? అతడు మంచి టెక్నిక్, సామర్థ్యం ఉన్న ఆటగాడు. దక్షిణాఫ్రికా-ఏ జట్టుపై అద్భుతంగా రాణించాడు".
-- హర్భజన్ సింగ్, భారత మాజీ క్రిెకెటర్
దీనిపై యువరాజ్ స్పందించాడు. "టాప్ ఆర్డర్ ఎంతో బలంగా ఉంది. వారికి నాలుగో స్థానం బ్యాట్స్‌మెన్‌తో అవసరం లేదు" అని ట్వీట్ చేశాడు.
వన్డేల్లో టీమిండియాకు రెండేళ్ల నుంచి నాలుగో స్థానం సమస్యగా మారింది. ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో మిడిలార్డర్ విఫలమైంది. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో పంత్ నాలుగులో దిగినా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఐదో స్థానంలో ఆడిన శ్రేయస్ అయ్యర్ సత్తా చాటాడు. మరో ఆటగాడు మనీష్ పాండేతోజట్టు ఎంపికలో శ్రేయస్‌కు పోటీ ఉంది.