తన ఆటతీరుతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. కెరీర్లో ఎన్నో రికార్డులు అందుకున్నాడు. తన సారథ్యంలో భారత్‌కు ప్రపంచకప్ అందించాడు. కీపర్‌గా మరెన్నో ఘనతలు సాధించాడు. ఈరోజు ధోనీ పుట్టినరోజు సందర్భంగా క్రీడాకారులు తమ విషెష్ తెలుపుతున్నారు.
'తలా' ధోనీకి బర్త్‌డే శుభాకాంక్షల వెల్లువ - Dhoni birthday wishes
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Happy Birthday MSD
బీసీసీఐ, చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు టీమ్ఇండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సురేశ్ రైనాతో సహా పలువురు క్రీడాకారులు శుభాకాంక్షలు తెలిపారు.
గతేడాది జరిగిన ప్రపంచకప్ తర్వాత ధోనీ క్రికెట్‌కు దూరమయ్యాడు. అప్పటి నుంచి మహీ రాక కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌తో పునరాగమనం చేయాలనుకున్నా.. కరోనా కారణంగా లీగ్ నిరవధిక వాయిదా పడింది.