తెలంగాణ

telangana

ETV Bharat / sports

నా జీవితంలో ఆనందం నువ్వు: హార్దిక్​ - hardhik pandya news

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా, నటి నటాషాల ప్రేమ ప్రయాణం ఇన్​స్టా వేదికగా అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా హార్దిక్​ "నా జీవితంలో ఆనందం" అంటూ నటాషాకు పుష్పగుచ్ఛం ఇస్తున్న ఫొటోలను పోస్ట్ చేశాడు. నటాషా కూడా "నువ్వు ఎప్పటికీ నా వాడివే" అని పేర్కొంది.

"Happiness In Life": Hardik Pandya Shares Adorable Pictures With Natasa Stankovic
నా జీవితంలో ఆనందం నువ్వు:హార్దిక్​

By

Published : Jun 19, 2020, 1:48 PM IST

కరోనా వైరస్​ కారణంగా విధించిన లాక్​డౌన్​తో క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా ప్రేయసి నటాషాతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరూ.. ఇన్​స్టాగ్రామ్​లో వరుస ఫొటోలను పోస్ట్​ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా హార్దిక్​.. నటి నటాషాకు ప్రేమతో పుష్పగుచ్ఛం ఇస్తూ "నా జీవితంలో ఆనందం" అంటూ ఫొటోలను షేర్ చేశాడు.

నటాషా కూడా "నువ్వు ఎప్పటికీ నా వాడివే" అంటూ హార్దిక్​కు బొకే ఇచ్చిన ఫొటోలను తన ఇన్​స్టాలో పంచుకుంది. వీరిద్దరి ప్రేమ ప్రయాణం నెటిజన్లు, అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇటీవలే నటాషా గర్భవతిగా ఉన్న ఫొటోలనుపోస్ట్​ చేస్తూ.. తాను తండ్రి కాబోతున్నట్లు వెల్లడించాడు హార్దిక్​. ఈ ఏడాది జనవరి 1న నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇరువురికి సంబంధించిన అందమైన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details