న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చెత్త షాట్ల వల్లే తమ జట్టు త్వరగా ఆలౌటైందని టీమిండియా బ్యాట్స్‌మన్ హనుమ విహారి అన్నాడు. అందరిలో ఇతడే అత్యధికంగా 55 పరుగులు చేశాడు. అయితే పిచ్ అంత ప్రమాదకరంగా ఏమీ లేదని, కీలక సమయాల్లో వికెట్లు సమర్పించడం వల్లే కివీస్ పైచేయి సాధించిందని చెప్పాడు.
"అవును, పిచ్ ఊహించినంత ప్రమాదకరంగా ఏమీ లేదు. న్యూజిలాండ్ బౌలర్లు చక్కని ప్రాంతాల్లో బంతులు వేశారు. ఈ ట్రాక్‌లో ఏం ఆశించాలో వారికి తెలుసు. పృథ్వీ శుభారంభం అందించాడు. పుజారా చాలా సమయం పాటు క్రీజులో ఉన్నాడు. కానీ అందరూ ఔటైన సమయమే సరైంది కాదు. పిచ్ వల్ల ఎవరూ పెవిలియన్ చేరలేదు. బ్యాట్స్‌మెన్ తప్పిదాలతోనే ఇలా జరిగింది. అయితే వికెట్ బాగుంది"