ఆటల్లో కొన్నిసార్లు ఒత్తిడిని అధిగమించటం చాలా కీలకమని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ అభిప్రాయపడింది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే మహిళల టీ20 ప్రపంచకప్‌కు మానసికంగా సన్నద్ధమవుతున్నట్లు తెలిపింది.
రెండు సార్లు సెమీస్‌లో ఓడాం.. ఈ సారి ప్రపంచకప్ పక్కా! - Harmanpreet
మైదానంలో ఒత్తిడిని అధిగమించటం చాలా కీలకమని తెలిపింది భారత మహిళా క్రికెట్ జట్టు సారథి హర్మన్ ప్రీత్‌కౌర్. రాబోయే టీ20 ప్రపంచకప్‌లో ఆటను ఆస్వాదిస్తూ విజయాన్ని అందుకుంటామని ధీమా వ్యక్తం చేసింది.
![రెండు సార్లు సెమీస్‌లో ఓడాం.. ఈ సారి ప్రపంచకప్ పక్కా! Handling pressure will be key in upcoming T20 World Cup: Harmanpreet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5814578-1009-5814578-1579783693187.jpg)
"చివరి రెండు టీ20 ప్రపంచకప్‌ల్లో సెమీఫైనల్ వరకు వెళ్లి ఓడిపోయాం. ఒత్తిడిని ఎదుర్కోవడమే అసలైన సవాలుగా మారింది. దీని వల్ల గతంలో పరాజయం పాలయ్యాం. ఈ సారి కచ్చితంగా ఆ పరిస్థితులను అధిగమిస్తాం. ఆటను ఆస్వాదిస్తూ మైదానంలో మెరుగైన ప్రదర్శన చేస్తాం".
- హర్మన్‌ప్రీత్ కౌర్, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్
ఈ ఏడాది మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నీ నిర్వహించనున్నారు.ఫైనల్ మ్యాచ్ మహిళా దినోత్సవం రోజున మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ)లో జరగనుంది. మొత్తం 10 జట్లు ఈ ప్రపంచకప్‌లో పాల్గొననున్నాయి.
ఇదీ చూడండి.. కోల్‌కతాకు శుభ్‌మన్‌ను కెప్టెన్ చేయండి..!