భారత క్రికెటర్ అజింక్య రహానేతో ఇంగ్లండ్ కౌంటీ జట్టు హాంప్‌షైర్ ఒప్పందం చేసుకుంది. ఈ జట్టు తరఫున ఆడబోతున్న తొలి భారతీయ క్రికెటర్‌గా రహానే గుర్తింపు పొందనున్నాడు. మే, జూన్, జులైలో కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
దక్షిణాఫ్రికా ఓపెనర్ మర్క్‌రమ్ స్థానంలో రహానేను తీసుకున్నారు. రాయల్ లండన్ వన్డే కప్ గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగిశాక మర్క్‌రమ్ ప్రపంచకప్‌లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టుతో చేరతాడు.