కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్).. గుర్‌కీరత్ సింగ్ మన్‌ను జట్టులోకి తీసుకుంది. బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ మోకాలి గాయం కారణంగా సీజన్‌కు దూరం అయ్యాడు. దీంతో అతడి స్థానంలో గుర్‌కీరత్‌ను ఎంపిక చేసుకుంది కేకేఆర్. నిరుడు గుర్‌కీరత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడాడు.
గాయంతో రింకూ దూరం.. కేకేఆర్‌లోకి గుర్‌కీరత్ - ఐపీఎల్
యువ క్రికెటర్ గుర్‌కీరత్ సింగ్ ఈ సారి ఐపీఎల్లో కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. కేకేఆర్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ మోకాలి గాయంతో ప్రస్తుత సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు అతడిని దక్కించుకుంది కేకేఆర్.
గాయంతో రింకూ దూరం.. కోల్‌కతాలోకి గుర్‌కీరత్
ఈసారి వేలంలో గుర్‌కీరత్‌ను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. తాజాగా కనీస ధర రూ.50 లక్షలకు అతడితో ఒప్పందం చేసుకుంది కోల్‌కతా. ప్రస్తుత 2021 సీజన్ గురుకీరత్‌కు 8వది.
ఇదీ చదవండి:ఐపీఎల్‌కు ముందు కరోనా పడగ