తెలంగాణ

telangana

ETV Bharat / sports

చరిత్రలో ఈరోజు.. గప్తిల్ సంచలన ఇన్నింగ్స్ - క్రికెట్​

అది 21 మార్చి 2015 ..ప్రపంచకప్​ క్వార్టర్​ ఫైనల్​.. ఒకవైపు కరేబియన్​, మరోవైపు కివీస్​ జట్టు. తొలుత బ్యాటింగ్​కి దిగిన న్యూజిలాండ్​ ఆటగాడు గప్తిల్​ అద్భుత ఇన్నింగ్స్​తో  క్రికెట్​ చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. వరల్డ్​కప్​లో 237 పరుగుల భారీ స్కోరు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

చరిత్రలో ఈరోజు.. గప్తిల్ సంచలన ఇన్నింగ్స్

By

Published : Mar 21, 2019, 8:46 PM IST

ప్రపంచకప్​ సెమీఫైనల్​కు చేరాలంటే బలమైన వెస్టిండీస్​ లాంటి ప్రత్యర్థిని ఎదుర్కోవాలి. అలాంటి సమయంలో తన బ్యాటుతో కరేబియన్లకు చుక్కలు చూపించాడు గప్తిల్. 11 సిక్సులు, 24 ఫోర్లతో సునామీ లాంటి ఇన్నింగ్స్​తో కివీస్​ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వరల్డ్​కప్​లో క్రిస్​గేల్​ తరఫున ఉన్న వ్యక్తిగత అత్యధిక స్కోర్​ని అధిగమించాడు. 163 బంతుల్లో 237 పరుగులతో అజేయంగా నిలవడం విశేషం.

గప్తిల్​ రికార్డు

మార్టిన్​ గప్తిల్​ దెబ్బకు 50 ఓవర్లలో 393 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది కివీస్. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన విండీస్​ 250 పరుగులకే కుప్పకూలింది. గేల్​ 61 బంతుల్లో 33 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు.

గుప్తిల్​ రికార్డు:

  1. 237 పరుగులు వన్డేల్లో రెండో వ్యక్తిగత అత్యధికం. రోహిత్​ శర్మ 264 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.
  2. వన్డేల్లో డబుల్​ సెంచిరీ చేసిన ఐదో ఆటగాడు. ఇతడి కన్నా ముందు రోహిత్​, సచిన్​, సెహ్వాగ్​, గేల్​ ఉన్నారు.
  3. పరిమిత ఓవర్ల మ్యాచ్​లో నాలుగో వ్యక్తిగత అత్యధికం.

200 పైగా పరుగులు సాధించిన ఆటగాళ్లు:

పరుగులు ఆటగాడు దేశం ప్రత్యర్థి సంవత్సరం
264 రోహిత్​శర్మ భారత్​ శ్రీలంక 2014
237* మార్టిన్​ గప్తిల్​ న్యూజిలాండ్​ వెస్టిండిస్​ 2015
219 సెహ్వాగ్ భారత్​ వెస్టిండిస్ 2011
215 క్రిస్ ​గేల్​ వెస్టిండిస్​ జింబాబ్వే 2015
209 రోహిత్​ శర్మ భారత్​ ఆస్ట్రేలియా 2013
200* సచిన్​ తెందూల్కర్​ భారత్​ దక్షిణాఫ్రికా 2010

ABOUT THE AUTHOR

...view details