తెలంగాణ

telangana

ETV Bharat / sports

రిషభ్​ పంత్​ కాదు.. 'స్పైడర్‌ పంత్'- ఐసీసీ ప్రశంస

టీమ్​ఇండియా వికెట్​కీపర్​ పంత్​కు 'స్పైడర్​ మ్యాన్​' పాటను అంకితమిచ్చింది ఐసీసీ. ​ఆసీస్​పై భారత్​ ఘన విజయం సాధించడంలో అతడు కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో ఈ పాటను అంకితం చేసింది.

By

Published : Jan 21, 2021, 9:24 AM IST

spider
స్పైడర్​

ఆసీస్​పై టీమ్​ఇండియా చారిత్రక విజయం సాధించడంలో 97పరుగులతో కీలక ఇన్నింగ్స్​ ఆడిన వికెట్​కీపర్​ రిషభ్​ పంత్​ను ప్రశంసించింది అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్. 'స్పైడర్‌ మ్యాన్‌' పోస్టర్‌కు పంత్‌ ఫొటో అంటించి.. అతడికి 'స్పైడర్​ మ్యాన్​' పాటను అంకితమిచ్చింది. "స్పైడర్‌ ఏం చేయగలదో పంత్‌ అది చేస్తాడు. సిక్సులు కొట్టగలడు, క్యాచ్‌లు పట్టగలడు. టీమ్ఇండియాను విజయ తీరాలకు చేర్చగలడు. ఇదిగో ఇతడే స్పైడర్‌ పంత్‌" అని పాట రూపంలో పొగిడింది.

నాలుగో టెస్టు​లో ఆసీస్​ రెండో ఇన్నింగ్స్​లో 56వ ఓవర్​ వద్ద పంత్​ "స్పైడర్​మ్యాన్​, స్పైడర్​మ్యాన్"​ అంటూ సరదాగా పాట పాడాడు. అప్పుడే స్మిత్​ వికెట్​ కోల్పోయిన జట్టును, కామెరూన్​ గ్రీన్​, టిమ్​ పైన్​ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలోనే పంత్​ పాడిన పాట మైక్​లో రికార్డయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ మారగా.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. విపరీతంగా లైక్స్​, కామెంట్స్​ వచ్చాయి.

ఇదీ చూడండి :పంత్​ 'స్పైడర్ ​మ్యాన్'​ పాట ​వైరల్

ABOUT THE AUTHOR

...view details