తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఎన్నికల స్టేడియంలో గంభీర్​ ధనాధన్

తూర్పు దిల్లీలో భాజపా తరఫున లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేసిన గౌతమ్ గంభీర్ విజయం సాధించాడు. ప్రధాన పార్టీల పరస్పర ఆరోపణల మధ్య జరిగిన ఈ పోరులో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్​ను కాదని భాజపాకే ప్రజలు పట్టం కట్టారు. ప్రత్యర్థులపై భారీ ఆధిక్యం సాధించాడు గంభీర్.

ఎన్నికల స్టేడియంలో గంభీర్​ ధనాధన్

By

Published : May 23, 2019, 5:48 PM IST

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. లోక్​సభ బరిలో తొలిసారి విజేతగా నిలిచాడు. ఈ ఏడాది మార్చిలో భాజపా తీర్ధం పుచ్చుకున్న గంభీర్.. తూర్పు దిల్లీ నుంచి పోటీ చేశాడు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రత్యర్థులు అతిషి(ఆమ్ ఆద్మీ), అర్విందర్ సింగ్​(కాంగ్రెస్)పై పైచేయి సాధించాడు. సూమారు 3 లక్షల పైచిలుకు ఓట్ల వ్యత్యాసంతో గెలుపొందాడీ బ్యాట్స్​మన్.

దిల్లీలో 7 స్థానాలకు లోక్​సభ ఎన్నికల జరిగాయి. అన్నింటిలోనూ తొలి నుంచి భాజపా ఆధిక్యం కొనసాగించింది. అదే జోరును కొనసాగిస్తూ విజయ బావుట ఎగురవేసింది. విజయం అనంతరం వినూత్నంగా ట్వీట్ చేశాడు గౌతమ్ గంభీర్. ప్రత్యర్థులపై అదిరే పంచ్​ వేశాడు.

గౌతమ్ గంభీర్ ట్వీిట్

ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీల అభ్యర్థులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. గౌతమ్ గంభీర్.. తనని కించపరిచేలా ఉన్న కరపత్రాలు పంచుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిషి ఆరోపించారు. స్పందించిన ఈ క్రికెటర్.. ఈ విషయాన్ని నిరూపిస్తే ఈ ఎన్నికల్లో గెలిచినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశాడు.

ABOUT THE AUTHOR

...view details