కరోనా కారణంగా ఇంటికే పరిమితమయ్యారు టీమ్ఇండియా క్రికెటర్లు. మ్యాచ్‌లు, ప్రాక్టీస్ లేక ఫిట్నెస్ను కాపాడుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఆటగాళ్లు ఒక్కొక్కరు శిక్షణను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పుజారా, షమీ, ఇషాంత్ శర్మ తమ ప్రాక్టీస్‌ను ప్రారంభించారు.
చాలా రోజుల తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నా: రోహిత్ - రోహిత్ శర్మ తాజా వార్తలు
కరోనా లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఆటగాళ్లు ఒక్కొక్కరు ఔట్ డోర్ శిక్షణను ప్రారంభిస్తున్నారు. తాజాగా టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు.
రోహిత్
తాజాగా టీమ్ఇండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్‌డోర్‌లో చెమటోడ్చాడు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. "తిరిగి ప్రాక్టీస్‌ను ప్రారంభించడం బాగుంది. చాలా రోజుల తర్వాత ఇలా" అంటూ హిట్‌మ్యాన్ ఆ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చాడు.