తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత క్రికెట్​ను ఆ దేవుడే రక్షించాలి' - జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్​సీఏ)

టీమిండియా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు పరస్పర విరుద్ధ ప్రయోజనాల కింద నోటీసులివ్వడాన్ని తప్పుపట్టారు మాజీ క్రికెటర్లు గంగూలీ, హర్భజన్​ సింగ్​. భారత క్రికెట్​ను దేవుడే రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

'భారత క్రికెట్​ను ఆ దేవుడే రక్షించాలి'

By

Published : Aug 7, 2019, 1:48 PM IST

భారత జట్టు మాజీ సారథి రాహుల్‌ ద్రవిడ్‌కు విరుద్ధ ప్రయోజనాల కింద బీసీసీఐ నోటీసులివ్వడంపై మాజీ ఆటగాళ్లు గంగూలీ, హర్భజన్​ స్పందించారు. వార్తల్లో నిలవాలనే ఉద్దేశంతోనే ఈ అంశాన్ని ఉపయోగించుకొంటున్నట్లు అభిప్రాయపడ్డారు.

" భారత క్రికెట్​లో కొత్య ఫ్యాషన్​ మొదలైంది. అదే పరస్పర విరుద్ధ ప్రయోజనం. ఇది వార్తల్లో ఉండాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే బీసీసీఐ ఎథిక్స్​ అధికారి నుంచి ద్రవిడ్​ నోటీసులు అందుకున్నాడు. ఇక క్రికెట్​ను దేవుడే రక్షించాలి ".
-- సౌరవ్​ గంగూలీ, భారత మాజీ క్రికెటర్​

గంగూలీ ట్వీట్​

గంగూలీ ట్వీట్లపై హర్భజన్​ స్పందించాడు. ఈ విధంగా దిగ్గజ ఆటగాళ్లకు నోటీసులు పంపి అవమానించొద్దని పరోక్షంగా సూచించాడు.

" నిజమేనా...?? ఇది ఎక్కడ వరకు వెళ్తుందో తెలియదు. ద్రవిడ్​ కన్నా మంచి వ్యక్తిని భారత క్రికెట్​ మళ్లీ తీసుకురాలేదు. ఇలాంటి దిగ్గజాలకు నోటీసులు పంపడం అంటే అవమానపరచడమే. భవిష్యత్తులో ఆటను మరింత ముందుకు తీసుకెళ్లాలంటే వారి సేవలు అవసరం. ఆ దేవుడే భారత క్రికెట్​ను రక్షించాలి ".
-- హర్భజన్​ సింగ్​, భారత మాజీ క్రికెటర్​

ఇటీవలే జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్​సీఏ) హెడ్‌గా బాధ్యతలు చేపట్టాడు ద్రవిడ్‌. ఈ నియామకం విరుద్ధ ప్రయోజనాల అంశంలో భాగమని బీసీసీఐ అంబుడ్స్​మన్​ జస్టిస్​ డీకే జైన్​కు... ఫిర్యాదు చేశాడు మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజీవ్‌ గుప్తా. ఫలితంగా​ మిస్టర్​ వాల్​కు నోటీసులు అందాయి. రెండు వారాల్లో ​ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ద్రవిడ్​ను ఆదేశించాడు జైన్​.

గతంలో ఇండియా సిమెంట్స్‌ సంస్థలో వైస్‌ఛైర్మన్‌ పదవిలో ఉండేవాడు ద్రవిడ్​. ఎన్​సీఏ అధ్యక్ష పదవి చేపట్టేముందు ఆ బాధ్యతలకు రెండేళ్ల కాలానికి తాత్కాలిక విరామం ప్రకటించాడు.

ఇవీ చూడండి...జాతీయ క్రికెట్​ అకాడమీ అధ్యక్షుడిగా రాహుల్

ABOUT THE AUTHOR

...view details