బంగ్లాదేశ్‌తో త్వరలో జరగబోయే టీ20 సిరీస్‌కు సంజూ శాంసన్ ఎంపికయ్యాడు. ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని అతడికి సూచించాడు.
"భారత్ టీ20 జట్టులోకి మళ్లీ వచ్చినందుకు సంజూ శాంసన్‌కు శుభాకాంక్షలు. చాలాకాలం తర్వాత అవకాశమొచ్చింది. సద్వినియోగం చేసుకో సంజూ" -ట్విట్టర్లో గౌతమ్ గంభీర్
చివరిసారిగా భారత్ తరఫున 2015 జూలైలో టీ20 మ్యాచ్ ఆడాడు సంజూ. అప్పటి నుంచి అతడిని ఎంపిక చేయలేదు టీమిండియా. ఈ మధ్య కాలంలో క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు కేరళ జట్టు నుంచి సస్పెన్షన్‌కు గురయ్యాడు.
అయితే గత నెలలో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు(212) సాధించి సెలక్టర్లు దృష్టిలో పడ్డాడు. టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. నవంబరు 3 నుంచి బంగ్లా పర్యటన ప్రారంభం కానుంది.
ఇది చదవండి: బంగ్లాతో పోరు: కోహ్లీకి విశ్రాంతి.. సంజూ, దూబేలకు చోటు