తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వెళ్లి ధోనీనే అడగండి.. తెలుస్తుంది' - rohit fires on dhoni fan

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ భవితవ్యంపై ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. అతడినే వెళ్లి అడగండంటూ ఆగ్రహించాడు.

రోహిత్
రోహిత్

By

Published : Apr 24, 2020, 12:51 PM IST

గతేడాది జరిగిన ప్రపంచకప్ సెమీస్ తర్వాత టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ దోనీ కెరీర్​ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అతడు రిటైర్మెంట్ తీసుకుంటాడని పలువురు భావిస్తున్నా.. ధోనీ నుంచి మాత్రం దీనిపై ఎలాంటి స్పందన లేదు. అభిమానులు మాత్రం ఈ విషయంపై ఎంతో ఆత్రుతగా ఉన్నారు. భారత క్రికెటర్లు కూడా మిస్టర్ కూల్ రీఎంట్రీపై అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్​స్టా లైవ్​లో మహీ గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రోహిత్ శర్మ చెప్పిన సమాధానమే ఇందుకు నిదర్శనం.

"ధోనీ క్రికెట్ ఆడని సమయంలో అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోతాడు. నువ్వొక పని చేయ్‌..లాక్‌డౌన్‌ ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కడికీ వెళ్లకు. లాక్‌డౌన్‌ ముగిశాక ఒక కారు కానీ, బైక్‌ కానీ, ఫ్లయిట్‌ కానీ తీసుకుని రాంచీ వెళ్లిపో. నేరుగా ధోనీ ఇంటికో పో. అక్కడ ధోనీ ఉంటాడు కదా.. అతన్నే అడుగు. మీరు ఆడతారా.. లేక ఆడరా అనే విషయాన్ని అడుగు. మాకైతే ధోనీ గురించి ఏ సమాచారం తెలియదు. కనీసం ఐడియా కూడా లేదు. ప్రపంచకప్ తర్వాత ధోనీ నుంచి ఎటువంటి సమాచారం మాకు లేదు"

-రోహిత్‌, టీమ్​ఇండియా క్రికెటర్

ప్రస్తుతం కరోనా కారణంగా క్రికెటర్లందరూ ఇంటివద్దే కుటుంబంతో కాలక్షేపం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. రోహిత్ కూడా తరచూ ఇన్​స్టా లైవ్​ల్లో పాల్గొంటున్నాడు.

ABOUT THE AUTHOR

...view details