తెలంగాణ

telangana

ETV Bharat / sports

గ్లోబల్ టీ20: మరోసారి యువరాజ్ మెరుపులు - toranto nationala

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గ్లోబల్ టీ20లో మరోసారి మెరిశాడు. విన్నిపెగ్​తో జరిగిన మ్యాచ్​లో 26 బంతుల్లో 45 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

యువరాజ్

By

Published : Jul 30, 2019, 1:28 PM IST

గ్లోబల్ టీ20లో టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ దూకుడు కొనసాగిస్తున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన యూవీ తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నాడు. తాజాగా విన్నీపెగ్‌ హాక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు.

ఇంతకుముందు ఎడ్మాంటన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అదే జోరును విన్నీ పెగ్‌తో జరిగిన మ్యాచ్‌లో కొనసాగించాడు యువీ.

విన్నీపెగ్‌ హాక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూవీతో పాటు రోడ్రిగో థామస్‌(65), పొలార్డ్‌(52)లు రాణించగా టొరంటో ఏడు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విన్నీపెగ్‌ చివరి బంతికి విజయం సాధించింది. క్రిస్‌ లిన్‌(89), షమాన్‌ అన్వర్‌(43), సన్నీ సొహాల్‌(58)లు సత్తాచాటారు.

ఇవీ చూడండి.. 'ప్రపంచకప్​ ఫైనల్​ను జీవితంలో​ మరోసారి చూడను'

ABOUT THE AUTHOR

...view details