తెలంగాణ

telangana

ETV Bharat / sports

వైరల్​: లగాన్ షాటేనా.. కాదు.. శివసేన స్కూప్ షాట్​! - Glenn Philips viral shot

ఒటాగోతో జరుగుతున్న మ్యాచ్​లో ఆక్లాండ్ బ్యాట్స్​మన్ గ్లెన్.. బ్యాట్​ను వెనక్కితిప్పి బంతిని సిక్సర్​గా మలిచాడు. వినూత్నంగా ఆడిన ఈ షాట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Glenn Philips reverse pull shot.. viral in internet
వైరల్​: లగాన్ షాటేనా.. కాదు.. శివసేన స్కూప్ షాట్​

By

Published : Nov 29, 2019, 4:49 PM IST

లగాన్ చిత్రం చూశారుగా.. అందులో బాబాజీ పాత్ర పోషించిన రాజేశ్ వివేక్ షాట్ గుర్తుందా.. వికెట్లకు అడ్డంగా నిలబడి వ్యతిరేకదిశలో బ్యాటింగ్​తో ఆకట్టుకున్నాడు. సరిగ్గా అదే తరహాలో న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్ ఆడిన వినూత్న షాట్​ నెట్టింట వైరల్​గా మారింది.

ఒటాగోతో జరుగుతున్న మ్యాచ్​లో గ్లెన్.. బ్యాట్​ను వెనక్కితిప్పి బంతిని సిక్సర్​గా మలిచాడు. ఈ వీడియోనూ ఐసీసీ ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ షాట్ పేరేంటో చెప్పాలని పోస్ట్ చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

'లగాన్ చిత్రంలో బాబాజీ ఆడిన స్కూప్ షాట్'​ అని ఒకరు ట్వీట్ చేయగా.. 'శివసేన స్కూప్ షాట్' అని ఇంకొకరు స్పందిచారు. 'స్విచ్‌ పుల్‌?రివర్స్‌ పుల్‌? అసాధారణమైన షాట్‌' అని రాజస్థాన్ రాయల్స్ జట్టు పోస్ట్ పెట్టింది.

ఒటాగోపై ఆక్లాండ్‌ 97 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆక్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. గ్లెన్‌ ఫిలిఫ్స్‌ (156, 135 బంతుల్లో 16×4, 3×6), మార్టిన్‌ గప్తిల్ (117, 130 బంతుల్లో 7×4, 3×6) శతకాలు సాధించారు. అనంతరం బరిలోకి దిగిన ఒటాగో 213 పరుగులకే కుప్పకూలింది.

ఇదీ చదవండి: ఏకైక టెస్టులో వెస్టిండీస్​దే విజయం

ABOUT THE AUTHOR

...view details