టీమ్ఇండియా యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్.. తనకు చిన్నపాటి లెజెండ్లా కనిపిస్తున్నాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. టెస్టు క్రికెట్ ప్రపంచంలో రానున్న పదేళ్లలో గిల్ ఉత్తమ ఓపెనర్‌గా ఎదగనున్నాడని జోస్యం చెప్పాడు.
"ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ తీరు నన్ను ఆకట్టుకుంది. ఆసీస్ బౌలర్లు షార్ట్ బంతులు విసిరినా.. అతడు హుక్ షాట్లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతడొక చిన్నపాటి లెజెండ్లా కనిపిస్తున్నాడు. రానున్న పదేళ్లలో టెస్టు క్రికెట్ ప్రపంచంలో గిల్ ఓ ఉత్తమ ఓపెనర్‌గా ఎదుగుతాడు".