తెలంగాణ

telangana

ETV Bharat / sports

గిల్​క్రిస్ట్​ను కంగారుపెట్టిన బౌలర్​ ఎవరో తెలుసా.! - harbhajan sing

భారత స్పిన్నర్ హర్భజన్​తో పాటు శ్రీలంక దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్​ తాను ఎదుర్కొన్న బౌలర్లలో అత్యంత కఠినమైనవారని తెలిపాడు ఆసీస్ మాజీ ఆటగాడు గిల్​క్రిస్ట్. భజ్జీ తననో 'కర్మ'లా వెంటాడినట్లు చెప్పాడు.

గిల్​క్రిస్ట్

By

Published : Nov 13, 2019, 7:49 PM IST

టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తనను 'కర్మ'లా వెంటాడాడని ఆస్ట్రేలియా మాజీ వికెట్‌కీపర్‌ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ అన్నాడు. భజ్జీ, ముత్తయ్య మురళీధరన్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్లని తెలిపాడు.

"కెరీర్‌ మొత్తం హర్భజన్ నాకో తప్పించుకోలేని 'కర్మ'గా మారాడు. అతడిని, మురళీని ఎదుర్కోవడం అత్యంత కష్టంగా అనిపించేది." అంటూ తన మనుసులోని విషయాలు వెల్లడించాడీ ఆసీస్ మాజీ క్రికెటర్.

ఆస్ట్రేలియా 16 టెస్టు విజయాల రికార్డుకు 2001లో టీమిండియా అడ్డుకట్ట వేసింది. ఆ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత హర్భజన్‌ బంతితో చెలరేగడం వల్ల గంగూలీ సేన 2-1తో సిరీస్‌ గెలిచింది.

"మేం 99/5తో ఉన్నాం. నేనప్పుడు క్రీజులోకి వెళ్లాను. 80 బంతుల్లో 100 చేశాను. మూడు రోజుల్లోనే మ్యాచ్‌ గెలిచాం. ఇంత సులభంగా ఉన్నప్పుడు గత 30 ఏళ్లుగా మా వాళ్లు ఏం చేస్తున్నారని అనుకున్నా. నేనెంత తప్పుగా అర్థం చేసుకున్నానో తర్వాత తెలిసింది. రెండో టెస్టులో యథార్థం తెలిసింది. హర్భజన్‌ మమ్మల్ని కకావికలం చేశాడు."
-గిల్​క్రిస్ట్, ఆసీస్ మాజీ క్రికెటర్

2004లో చెన్నై టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌పై చేసిన 49 పరుగుల ఇన్నింగ్స్‌ తనకెంతో సంతృప్తినిచ్చిందని గిల్‌క్రిస్ట్‌ అన్నాడు. ఈ సిరీస్‌ను టీమిండియా 1-2 తేడాతో చేజార్చుకుంది. 35 ఏళ్ల తర్వాత ఆసీస్‌కు భారత్‌లో అతిగొప్ప ఘనత ఇదే.

ఇవీ చూడండి.. ధోనీ తిట్లు బాగా పని చేశాయి: దీపక్

ABOUT THE AUTHOR

...view details