కరోనా లాక్డౌన్ కారణంగా ఇంట్లో భార్యలతో హెయిర్ కట్ చేయించుకుంటున్నారు కొంతమంది క్రీడాకారులు. వారిలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉండగా.. తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ రాబర్ట్ కీ ఆ జాబితాలో చేరాడు. భార్యలతో హెయిర్‌కట్ చేయించుకోవటం ఓ సాహసమేనని అంటున్నాడు. దానికి సంబంధించిన ఓ చిత్రాన్ని ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు.
ఇక అనుమతించను
ఆ చిత్రంలో రాబర్ట్ తల వెనుక భాగంలో ట్రిమ్మర్‌తో జుట్టును కట్ చేసి ఉంది. "హెయిర్‌కట్‌కు మరోసారి నా భార్య అనుమతించను" అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చాడు రాబర్ట్. అతడి భార్య ఫ్లూర్కీ ట్విట్టర్లో దీనిపై క్షమాపణ కోరగా.. క్రికెటర్ సామ్ బిల్లింగ్స్‌తో పాటు పలువురు నెటిజన్లు నవ్వుతూ స్పందించారు.
కరోనా లాక్డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని సేవలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పురుషుల సెలూన్లూ మూతపడ్డాయి. దీంతో వారి భార్యలతో హెయిర్‌కట్ చేయించుకుంటున్నారు కొంత మంది సెలబ్రిటీలు. ఇటీవలె టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మతో హెయిర్ కట్ చేయించుకున్న వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్నాడు.
ఇదీ చూడండి.. ఫోర్ కొట్టు కోహ్లీ.. అనుష్క చమత్కారం