తెలంగాణ

telangana

ETV Bharat / sports

"2020లో మరిన్ని ఛాలెంజ్​లకు సిద్ధంగా ఉండండి" - ప్రపంచకప్​ 2019

టీమిండియా.. వచ్చే ఏడాదిలోనూ ఇదే ఉత్సాహంతో మరిన్ని విజయాలను సాధించాలని క్రికెట్​ పురుషుల జట్టు కోచ్​ రవిశాస్త్రి అన్నాడు. క్రీడాకారులకు ట్విట్టర్​ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాడు.

Get ready to attack the fresh challenges ahead: Ravi Shastri's New Year message to Team India
"2020లో మరిన్ని ఛాలెంజ్​లకు సిద్ధంగా ఉండండి"

By

Published : Dec 31, 2019, 7:47 PM IST

2019... టీమిండియాకు మరిచిపోని ఏడాదిగా మిగిలిపోనుందని భారత పురుషుల క్రికెట్​ జట్టు కోచ్​ రవిశాస్త్రి అన్నాడు. ఇదే జోష్​తో 2020లో మరిన్ని విజయాలను సాధించాలని ట్విట్టర్​లో రాసుకొచ్చాడు.

"టీమిండియా క్రికెటర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జట్టు విజయాల్లో 2019.. మంచి అనుభూతిని అందిచింది. ఇదే ఉత్సాహంతో 2020లో కొత్త ఛాలెంజ్​లను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండండి"
-రవిశాస్త్రి, టీమిండియా హెడ్​ కోచ్​

ఈ ఏడాది.. ఇంగ్లాండ్​లో జరిగిన వన్డే ప్రపంచకప్​లో భారత్.. సెమీస్​లో నిష్క్రమించింది. లీగ్​ దశ​లో వరుసగా 7 విజయాలను సొంతం చేసుకున్నా.. సెమీఫైనల్​లో న్యూజిలాండ్​తో మ్యాచ్​లో పరాజయం పాలైంది. ఈ ఒక్క అసంతృప్తి మినహా మిగిలిన అన్ని సిరీస్​ల్లో టీమిండియా సత్తా చాటింది.

కొత్త సంవత్సరం.. కొత్త ఛాలెంజ్​లతో

2020 జనవరి 5న శ్రీలంకతో టీమిండియా.. మూడు టీ20ల సిరీస్​ ఆడనుంది. ఇది​ పూర్తవగానే జనవరి 14 నుంచి ఆస్ట్రేలియాతో, జనవరి 24 నుంచి న్యూజిలాండ్​తో టీ20, టెస్టు, వన్డే సిరీస్​లు జరగనున్నాయి.

ఇదీ చదవండి:-థాయ్​లాండ్​ బీచ్​లో రాహుల్-అతియా షికార్లు

ABOUT THE AUTHOR

...view details