తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమిండియాకు స్టార్ ఫుట్​బాలర్ మద్దతు - INDIAN CRICKET TEAM

జర్మనీ స్టార్ ఫుట్​బాల్​ ప్లేయర్ థామస్ ముల్లర్.. ప్రస్తుత ప్రపంచకప్​లో టీమిండియాకు మద్దతుగా నిలిచాడు. భారత జట్టు జెర్సీ ధరించిన ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నాడు.

టీమిండియాకు స్టార్ ఫుట్​బాలర్ మద్దతు

By

Published : Jun 4, 2019, 10:43 AM IST

టీమిండియాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులెక్కువ. అలాగే.. ఓ స్టార్ ఫుట్​బాలర్ టీమిండియాపై మక్కువ పెంచుకున్నాడు. సామాజిక మాధ్యమాల వేదిక తన ఇష్టాన్ని వ్యక్తం చేశాడు.

ఫుట్​బాల్​ ప్రపంచకప్​ విజేత జర్మనీ జట్టులోని సభ్యుడైన థామస్ ముల్లర్.. ప్రస్తుతం క్రికెట్ వరల్డ్​కప్​ ఆడుతున్న టీమిండియాకు మద్దతు పలికాడు. భారత జెర్సీ ధరించిన ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నాడు. 2014 ప్రపంచకప్​ గెలిచిన జర్మనీ జట్టులో సభ్యుడు థామస్ ముల్లర్.

"క్రికెట్ ప్రపంచకప్​ ఆడుతున్న అందరికీ నా శుభాకాంక్షలు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి నా అభినందనలు. నేను ఆడుతున్న డైమాన్​చాఫ్ట్ ఫుట్​బాల్​ జట్టుకు అతడు అభిమాని. చాలా సార్లు మాకు మద్దుతుగా నిలిచాడు." -థామస్ ముల్లర్, జర్మన్ ఫుట్​బాలర్

ప్రపంచకప్​లో భాగంగా రేపు(జూన్ 5న) దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్​ ఆడనుంది టీమిండియా. గెలిచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్​ల్లోనూ ఓటమి పాలైంది సఫారీ జట్టు.

ఇది చదవండి: పాకిస్థాన్​లో ఆసియా కప్.. భారత్​ పాల్గొంటుందా?

ABOUT THE AUTHOR

...view details