తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియా నూతన సెలక్టర్​గా బెయిలీ నియామకం - George Bailey appointed Australia cricket selector

ఆస్ట్రేలియా నూతన సెలక్టర్​గా ఆ జట్టు మాజీ కెప్టెన్​ జార్జ్​బెయిలీ నియామితులయ్యాడు. ఈ పదవికి ఇటీవలే అతడి నియామక ప్రక్రియ పూర్తవగా.. నేడు అధికారికంగా ప్రకటించారు.

George Bailey appointed Australia cricket selector
జార్జ్ బెయిలీ

By

Published : Nov 27, 2019, 4:19 PM IST

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జార్జ్ బెయిలీకి కీలక పదవి లభించింది. ఆ జట్టు నూతన సెలక్టర్​గా నియామితులయ్యాడు. సెలక్షన్ ప్యానెల్లోని ముగ్గురు సభ్యుల్లో ఒకరిగా ఉన్న గ్రేగ్ చాపెల్ స్థానంలో బెయిలీ బాధ్యతలు చేపట్టాడు. ఇతడితో పాటు ఆసీస్ జాతీయ జట్టు కోచ్​ జస్టిన్ లాంగర్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ట్రెవర్ హాన్స్ ఉన్నారు.

"గత కొన్నేళ్లుగా ఆటగాడిగా ఆసీస్​ జట్టుకు సేవలందించా. ఇప్పుడు సెలక్టర్ వచ్చిన అవకాశాన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నా. సెలక్షన్ ప్రక్రియలో నా అనుభవాన్ని ఉపయోగించి ఆ పదవికి మరింత విలువ చేకూరుస్తానని ఆత్మవిశ్వాసంతో ఉన్నా. ట్రెవర్, జస్టిన్​తో కలిసి పనిచేయనుండడం ఆనందంగా ఉంది" -జార్జ్ బెయిలీ, ఆసీస్ నూతన సెలక్టర్.

జాతీయ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించి, సెలక్టర్​గా బాధ్యతలు చేపట్టిన వారిలో బెయిలీ మూడో వ్యక్తి. ఇంతకుముందు సర్ డాన్ బ్రాడ్​మన్, మైకేల్ క్లార్క్ లాంటి దిగ్గజ క్రికెటర్లూ సెలక్టర్​గా పని చేశారు.

సెలక్టర్​గా బాధ్యతలు స్వీకరించనున్న బెయిలీ.. బిగ్​బాష్​ లీగ్ హోబర్ట్ హరికేన్స్​ తరఫున ఇంకా ఆడుతూనే ఉండటం విశేషం. 5 టెస్టులు, 90 వన్డేలు, 30 టీ20ల్లో ఆస్ట్రేలియా తరఫున ప్రాతినిధ్యం వహించాడీ క్రికెటర్.

2013-14 యాషెస్​ సిరీస్​లో ఇంగ్లాండ్​ను క్లీన్​స్వీప్ చేసిన ఆసీస్ జట్టులో బెయిలీ సభ్యుడు. చివరగా 2017 సెప్టెంబరులో పాకిస్థాన్​తో జరిగిన టీ20 మ్యాచ్​ ఆడాడు.

ఇదీ చదవండి: 'ఆసియా ఆర్చరీ' టోర్నీలో భారత్​కు తొలి స్వర్ణం

ABOUT THE AUTHOR

...view details