వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రామ్‌నరేశ్ శర్వాణ్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశాడు విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్. కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లోని జమైకా తలావాస్ జట్టు నుంచి తనను తొలగించడానికి ఆ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన రామ్‌నరేశ్ కారణమని ధ్వజమెత్తాడు.
"నువ్వు ఒక పాము లాంటివాడివి శర్వాణ్. ప్రతీకారం తీర్చుకునేందుకు విషం చిమ్ముతున్నావు. నమ్మినవారిని వెన్నుపోటు పొడవడానికీ వెనుకాడవు. కరోనా వైరస్ కంటే పెద్ద ప్రమాదకారివి" అంటూ రామ్‌నరేశ్ శర్వాణ్‌ను ఉద్దేశించి క్రిస్ గేల్ గతంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.