తెలంగాణ

telangana

ETV Bharat / sports

విధ్వంసక క్రికెటర్ గేల్ సరికొత్త రికార్డు - కుమార సంగక్కర్

యూనివర్సల్ బాస్ క్రిస్​గేల్ వన్డేల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్​పై ఈ ఫార్మాట్​లో అత్యధిక పరుగులు (1632) చేసిన క్రికెటర్​గా నిలిచాడు.

విధ్వంసక క్రికెటర్ గేల్ సరికొత్త రికార్డు

By

Published : Jun 14, 2019, 7:33 PM IST

ప్రపంచకప్​లో వెస్టిండీస్​కు ఆడుతున్న క్రిస్​గేల్.. శుక్రవారం ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో ఆ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా నిలిచాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్​పై గేల్ సాధించిన పరుగులు 1,632. శ్రీలంక క్రికెటర్ సంగక్కర 1,625 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.

ఈ ఘనత అందుకోవడానికి గేల్ 34 ఇన్నింగ్స్​ ఆడితే, సంగక్కర 41 ఇన్నింగ్స్​ తీసుకున్నాడు. ఈ జాబితాలో వివ్‌ రిచర్డ్స్‌(1619), పాంటింగ్‌(1598), జయవర్థనే(1562)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

వెస్డిండీస్ బ్యాట్స్​మన్ క్రిస్ గేల్

సౌతాంఫ్టన్ వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచకప్​ మ్యాచ్​లో ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి 212 పరుగులకే ఆలౌటైంది విండీస్ జట్టు. నికోలస్ పూరన్ ఒక్కడే 63 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

ఇది చదవండి: 'ఆటగాళ్లూ... వారితో ఎక్కువ సమయం గడపండి' అంటున్న న్యూజిలాండ్ కోచ్

ABOUT THE AUTHOR

...view details