ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు నైపుణ్యం గల క్రికెటర్లు దొరికారని జట్టు యజమాని నెస్ వాడియా అభిప్రాయపడ్డారు. ఈ సీజన్ సగం మ్యాచ్‌లకు దూరమైన విధ్వంసక క్రిస్ గేల్.. వచ్చే ఏడాది పంజాబ్ ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ ఉంటాడని తెలిపారు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, క్రిస్ గేల్, పేసర్ షమి రూపంలో మంచి కూర్పు లభించిందని అన్నారు. యువ క్రికెటర్లు అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్ ప్రదర్శనల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
"కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో స్థిరమైన ఆటగాళ్ల బృందం ఉండటం సంతోషం. కానీ మిడిల్ ఆర్డర్, డెత్ ఓవర్లలో బౌలింగ్ సమస్యలను అధిగమించాలి. కెప్టెన్సీ, కోచింగ్‌లో చాలా మార్పులు చేసినట్లుగా జట్టునూ సరిదిద్దాలనుకుంటున్నాం. రాహుల్ కెప్టెన్‌గా చాలా బాగా ఆకట్టుకున్నాడు. అతడు ఉండటం మా అదృష్టం. షమి కూడా చాలా తెలివైన బౌలర్. పూరన్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌లు మంచి ప్రదర్శన చేశారు"