తెలంగాణ

telangana

ETV Bharat / sports

గేల్​ తుపాన్​కు సిద్ధమవుతున్న టీ10 లీగ్

మరో నెల రోజుల్లో టీ10 లీగ్ ప్రారంభం కానుంది.​ ఇందులో పాల్గొనేందుకు ప్రముఖ ఆటగాళ్లు గేల్‌, షాహిద్​ అఫ్రిది లాంటి వాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 28 నుంచి ఫ్రిబవరి 6 వరకు మ్యాచ్​లు జరగనున్నాయి.

By

Published : Dec 21, 2020, 7:16 PM IST

gayle
గేల్

అబుదాబి వేదికగా జరగబోయే టీ10 లీగ్‌ నాలుగో సీజన్‌ వచ్చే జనవరి 28 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరగనుంది. ఇందులో 8 జట్లు ఆడనున్నాయి. ఈసారి క్రిస్‌గేల్‌(వెస్టిండీస్​), డ్వేన్​ బ్రావో(వెస్టిండీస్​), షాహిద్​ అఫ్రిదీ(పాకిస్థాన్​) లాంటి స్టార్ ఆటగాళ్లు సందడి చేయనున్నారు. ఇందులో ఆడేందుకు తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు.

"ఫార్మాట్‌ ఎంత చిన్నదైతే ఆట మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అబుదాబిలోని క్రికెట్‌ స్టేడియంలో ఆడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. గేల్‌ తుపాన్​‌ వస్తోంది" అని గేల్‌ అన్నాడు. "ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన స్టేడియాలలో ఒకటైన ఈ మైదానంలో ఆడటానికి ఎదురు చూస్తున్నానని" అఫ్రిదీ తెలిపాడు.

ఈ లీగ్​లో గేల్​(అబుదాబి), అఫ్రిది(ఖలందర్స్​), బ్రావో(దిల్లీ బుల్స్​), రసెల్​(నథరన్ వారియర్స్​), నరైన్​(డెక్కన్​ గ్లాడియేటర్స్​), షోయబ్​ మాలిక్​(మరాఠా అరేబియన్స్​), థిసారా పెరెరా(పుణె డెవిల్స్​), ఇసూరు ఉదానా(బంగ్లా టైగర్స్​) వేర్వేరు జట్ల తరఫున ఆడనున్నారు.

ఇదీ చూడండి : క్రికెట్​లో కొత్త ఫార్మాట్​.. బరిలో యువీ, గేల్​​

ABOUT THE AUTHOR

...view details