తెలంగాణ

telangana

By

Published : Aug 23, 2020, 9:52 PM IST

ETV Bharat / sports

రోహిత్​లా ఆడాలనుకుంటున్న గావస్కర్

భారత స్టార్ క్రికెటర్​ రోహిత్​ శర్మలా తనకు ఆడాలని ఉందన్నాడు మాజీ క్రికెటర్​ సునీల్​ గావస్కర్​. ఆత్మవిశ్వాసం కోల్పోయి తాను క్రికెట్​ నుంచి వైదొలిగినట్లు వెల్లడించాడు.

Gavaskar
గావస్కర్​

టీమ్​ఇండియా ఓపెనర్​ రోహిత్​ శర్మపై దిగ్గజ క్రికెటర్​ సునీల్​ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు​. హిట్​మ్యాన్​లా బ్యాటింగ్​ చేయాలని ఉందని అన్నాడు. తాను ఆడేటప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోయి, చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల క్రికెట్​ నుంచి తప్పుకున్నట్లు తెలిపాడు.

"వన్డే, టెస్టు​ల్లో రోహిత్​ బ్యాటింగ్​ అద్భుతం. నాకు అలానే ఆడాలని ఉంది. కానీ అప్పట్లో ఆత్మవిశ్వాసం తగ్గిపోయి ఆడలేకపోయాను. నా తర్వాతి తరం ఆటగాళ్ల నైపుణ్యం ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నాను"

-గావస్కర్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

టెస్టు క్రికెట్లో 10 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్​మన్​గా గావస్కర్​ రికార్డు సాధించాడు. ఈ ఫార్మాట్​లో 125 మ్యాచులు ఆడగా, అందులో 34 సెంచరీలు ఉన్నాయి. 108 వన్డేలాడి 3,092 పరుగులు చేశాడు.

రోహిత్​ శర్మ వన్డేల్లో 9,115 పరుగులతో పాటు 27 సెంచరీలు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో 2773 పరుగులు చేసి.. టాప్​ స్కోరర్​గా కొనసాగుతున్నాడు. టెస్టుల్లో 32 మ్యాచుల్లో 2141 పరుగులు సాధించాడు.

ఇది చూడండి ప్రేక్షకులు లేకుండా క్రికెట్​ కష్టమే: స్మిత్

ABOUT THE AUTHOR

...view details