తెలంగాణ

telangana

ETV Bharat / sports

గావస్కర్​పై అనుష్క ఫైర్.. 'నాకు వివరణ ఇవ్వాల్సిందే' - IPL NEWS UPDATES

తనతో పాటు భర్త కోహ్లీని, గావస్కర్​ విమర్శించడంపై నటి అనుష్క శర్మ స్పందించింది. ఈ విషయమై వివరణ ఇవ్వాలని కోరింది. తన పేరు ఉపయోగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది.

Gavaskar
గావస్కర్​

By

Published : Sep 25, 2020, 3:56 PM IST

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మపై మాజీ క్రికెటర్ సునీల్​ గావస్కర్​ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై స్పందించిన అనుష్క శర్మ.. ఇవి అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పింది. గావస్కర్​ వివరణ ఇవ్వాల్సిందిగా ఇన్​స్టా​లో పోస్ట్​ పెట్టింది.

"హలో మిస్టర్​ గావస్కర్,​ మీ వ్యాఖ్యలు ఎంతో అవమానకరమైనవి. ఓ ఆటగాడి ప్రదర్శన ఆధారంగా అతడి భార్యపై ఆరోపణలు చేశారు? దీనిపై మీ నుంచి నాకు వివరణ కావాలి. గత కొన్నేళ్లుగా క్రికెటర్ల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటం నేను గమనిస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం ఇవ్వాలని మీకు తెలియదా? నా భర్త ఆట గురించి మాట్లాడేందుకు మీరు సిద్ధమేనని తెలుసు. కానీ, అప్పుడు నా పేరు ఉపయోగించాల్సిన అవసరం ఎందుకొచ్చిందో నాకు తెలియాలి"

అనుష్క శర్మ, కోహ్లీ భార్య

పంజాబ్​ గురువారం జరిగిన మ్యాచ్​లో కోహ్లీ రెండు క్యాచులు జారవిడిచాడు. దీంతో పాటు బ్యాటింగ్​లోనూ పేలవ ప్రదర్శన చేశాడు. మిగిలిన వారు కూడా విఫలమవడం వల్ల బెంగళూరు ఘోరంగా ఓడిపోయింది. ఈ క్రమంలో కామెంటరీ బాక్స్​లో ఉన్న గావస్కర్​.. కోహ్లీ, అనుష్కల్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో వివాదం మొదలైంది. గావస్కర్​పై​ విరాట్​ అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ట్వీట్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details