సునీల్ గావస్కర్, వివ్ రిచర్డ్సే తన బ్యాటింగ్ హీరోలని చెప్పాడు దిగ్గజ సచిన్ తెందుల్కర్. 'గిఫ్ట్ ఆఫ్ లైఫ్' పేరుతో జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశాడు మాస్టర్.
వాళ్లే నా బ్యాటింగ్ హీరోలు: సచిన్ - sachin latest news
తన క్రికెట్ కెరీర్లో గావస్కర్, వివ్ రిచర్డ్స్.. బ్యాటింగ్ హీరోలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చెప్పాడు. నిజ జీవితంలో మాత్రం తన తండ్రేనని అన్నాడు.
వాళ్లే నా బ్యాటింగ్ హీరోలు: సచిన్
"యువ ఆటగాడిగా ఉన్నప్పటి నుంచి భారత జట్టుకు ఆడేంత వరకు నా బ్యాటింగ్ హీరోల గురించి చెబుతూనే ఉన్నాను. ఒకరు మన సునీల్ గావస్కర్, మరొకరు వెస్టిండీస్ గ్రేట్ వివ్ రిచర్డ్స్. నిజ జీవితంలో మాత్రం మా నాన్నే(రమేశ్ తెందుల్కర్) నాకు స్ఫూర్తి ప్రదాత. ఆయనది ప్రశాంత్ చిత్తం, మంచి మనస్తత్వం. ఆయనలానే కావాలనేది నా కల" అని సచిన్ తెలిపాడు.