దిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)ను రద్దు చేయాలని మాజీ ఓపెనర్, భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీని కోరాడు. డీడీసీఏ ఆదివారం నిర్వహించిన సర్వసభ్య వార్షిక సమావేశంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడం వల్ల అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు మదన్ లాల్, గౌతమ్ గంభీర్ డీడీసీఏపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వెంటనే చర్యలు తీసుకుని, డీడీసీఏను రద్దు చేయాలని గంభీర్ కోరాడు.
దిల్లీ క్రికెట్ సంఘాన్ని రద్దు చేయమంటోన్న గంభీర్ - BCCI
దిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ను రద్దు చేయాలని కోరాడు మాజీ క్రికెటర్ గంభీర్. దీనిపై సౌరభ్ గంగూలీ వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపాడు.
గంభీర్
డీడీసీఏ జాయింట్ సెక్రటరీ రాజన్ మంచందతో పాటు మరికొందరు సభ్యులు పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. సమావేశంలో ఒక ప్రతిపాదన తీసుకురాగా దాన్ని ఏకగ్రీవంగా తీర్మానించలేదని ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది.
ఇవీ చూడండి.. దిల్లీ క్రికెట్ వార్షికోత్సవ సమావేశంలో ఘర్షణ