ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌లోని తొలి మ్యాచ్ కోసం టీమ్ఇండియా జట్టును ఎంపిక చేయడం భారత సెలెక్టర్లకు ఈసారి కష్టతరం కావొచ్చు. ఆస్ట్రేలియా పర్యటనలో కుర్రాళ్లు అద్భుతంగా ఆడినా.. సీనియర్లకూ జట్టులో అవకాశం ఇవ్వాల్సిన నేపథ్యంలో ఎవర్ని ఎంచుకోవాలనే దానిపై టీమ్ఇండియా మేనేజ్మెంట్ తలమునకలైంది. అయితే తొలిటెస్టుకు కావాల్సిన జట్టు కూర్పును మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తయారు చేశాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో భారత జట్టులో ఎంతమంది బౌలర్లను ఎంచుకుంటారనే దానిపై గంభీర్ మాట్లాడాడు.
"కచ్చితంగా ఐదుగురు బౌలర్లతో ఆడాలని నేను గట్టిగా నమ్ముతున్నా. కాబట్టి, 7వ స్థానంలో అక్షర్ పటేల్‌ను ఎంపిక చేస్తా. అక్షర్ బ్యాట్‌తోనూ రాణించగలడు. సిడ్నీ టెస్టు తర్వాత అశ్విన్‌లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. 8వ స్థానానికి అశ్విన్‌ను తీసుకుంటా. దీంతో జట్టుకు 350 స్కోరు దాటే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన బౌలర్లు అవసరం. తొలి టెస్టు కోసం జస్ప్రీత్ బుమ్రాను తీసుకుని.. రెండో మ్యాచ్‌లో విరామాన్ని ఇచ్చి, పింక్-బాల్ టెస్టుకు సన్నద్ధమవడానికి సూచనలిస్తాను".
- గౌతమ్ గంభీర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్