తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీసేన చేసిన పెద్ద తప్పు అదే: గంభీర్ - ఐపీఎల్ 2020 తాజా వార్తలు

ఐపీఎల్​లో పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో బెంగళూరు భారీ తేడాతో ఓడిపోయింది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా చివరి ఓవర్‌ దూబెతో వేయించడం విరాట్‌ కోహ్లీ చేసిన తప్పిదం అని వ్యాఖ్యానించాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ గంభీర్.

Gautam Gambhir
'కోహ్లీసేన చేసిన పెద్ద తప్పు అదే'

By

Published : Sep 26, 2020, 7:32 AM IST

ఐపీఎల్​లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌ గురించి భారత మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ స్పందించాడు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా చివరి ఓవర్‌ దూబెతో వేయించడం విరాట్‌ కోహ్లీ చేసిన తప్పిదం అని వ్యాఖ్యానించాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

"దూబె మొదట బాగా బౌలింగ్‌ చేశాడు. దాంతో విరాట్‌ అతడికి మరో ఓవర్‌ ఇచ్చాడు. కానీ అది ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌. అప్పటికే రాహుల్‌ సెంచరీ బాది జోరుమీద ఉన్నాడు. నేనైతే నవదీప్‌ సైనీ లేదా స్టెయిన్‌లో ఒకరితో బౌలింగ్‌ చేయించే వాడిని. అయితే స్టెయిన్‌ కూడా తన డెత్‌ ఓవర్‌లో ధారాళంగా పరుగులిచ్చాడు. కానీ నేను గతంలో జట్టులోని అత్యుత్తమ బౌలర్‌కే చివరి ఓవర్‌ ఇచ్చాను. కోహ్లీ మాత్రం 17 ఓవర్‌ వరకే నవదీప్‌కున్న ఓవర్లన్నీ వేయించాడు. కేఎల్ 80ల్లోనే అవుటై ఉంటే పంజాబ్‌ స్కోరు 185 వరకే పరిమితం అయ్యేది. అప్పుడు బెంగళూరుకు ఇబ్బంది ఏర్పడేది కాదు. పూర్తిగా భిన్నమైన ప్రణాళికతో కోహ్లీ సేన ఇన్నింగ్స్‌ సాగేది. కానీ ఇది టీ 20. చిన్న చిన్న తప్పిదాలు కూడా చాలా నష్టాన్ని కలిగిస్తాయి. ఆ ప్రభావం మ్యాచ్‌ ఫలితాన్ని నిర్దేశిస్తుంది"

-గంభీర్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 97 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. కేఎల్‌ రాహుల్‌ 69 బంతుల్లోనే 132 పరుగులు చేసి బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ABOUT THE AUTHOR

...view details