కరోనాపై పోరాటంలో మద్దతుగా నిలిచాడు టీమ్ఇండియా మాజీ ఆటగాడు, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యాలయమైన బేలూర్ మఠానికి 2 వేల కిలోల బియ్యాన్ని దానంగా ఇచ్చాడు.
25 సంవత్సరాల తర్వాత బేలూర్ మఠాన్ని సందర్శించి.. 2 వేల కిలోల బియ్యాన్ని దానంగా ఇస్తున్నట్టు ట్విట్టర్లో ప్రకటించాడు గంగూలీ. ఇటీవలే కరోనా బాధితులకు రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించాడు.