భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి రంగం సిద్ధమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా మాజీ సారథి సౌరభ్ గంగూలీ ఏకగ్రీవంగా ఎంపికైనట్లే. అధ్యక్ష పదవికి మాజీ ఆటగాడు బ్రిజేష్ పటేల్ పేరు వినిపించినప్పటికీ సౌరభ్కే పగ్గాలు దక్కనున్నాయి.
బోర్డు కార్యదర్శిగా కేంద్ర హోంమంత్రి తనయుడు జై షా... కోశాధికారిగా అరుణ్ ధూమల్బాధ్యతలు చేపట్టనున్నారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడే ధూమల్.
నామినేషన్లు దాఖలు చేయడానికి సోమవారమే ఆఖరి రోజు. అయితే ఈ పదవులకు ఎన్నికలు జరగడం లేదు. ఎన్నో వారాల చర్చలు, వాదోపవాదాల అనంతం అందరు ఏకాభిప్రాయానికి రావడమే ఇందుకు కారణం.