తెలంగాణ

telangana

ETV Bharat / sports

గంగూలీకి తప్పని అంపన్​ కష్టాలు

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీకి అంపన్​ తుపాను కష్టాలు తప్పలేదు. కోల్​కతాలోని తన నివాసంలో ప్రచండ గాలులకు మామిడి చెట్టు కూలిపోయింది. దాన్ని యథాస్థితిలోకి తీసుకొచ్చినట్లు ట్విట్టర్​లో వెల్లడించాడు దాదా.

Ganguly saves mango tree which uprooted in his home during Amphan Cyclone
సౌరభ్​ గంగూలీకి తప్పని అంపన్​ కష్టాలు

By

Published : May 22, 2020, 1:38 PM IST

అంపన్‌ పెను తుపాను కష్టాలు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీకీ తప్పలేదు. కోల్‌కతాలోని బెహాలా ప్రాంతంలో దాదా నివాసం ఉంటున్న పలాషియల్‌ బంగ్లా ఇంటి ఆవరణలో పెను గాలులకు ఓ మామిడి చెట్టు విరిగిపడింది. దీంతో దాదానే స్వయంగా రంగంలోకి దిగి ఆ చెట్టును మళ్లీ నిలబెట్టాడు. విరిగిపడిన చెట్టు కొమ్మలకు తాళ్లు కట్టి దాన్ని యథాస్థితిలోకి తీసుకువచ్చినట్లు గంగూలీ ట్విట్ట‌లో తెలిపాడు. అందుకు సంబంధించిన రెండు ఫొటోలు షేర్‌ చేశాడు.

రెండ్రోజులుగా అంపన్‌ తుపాను కోల్‌కతా నగరాన్ని ముంచెత్తింది. బుధవారం సాయంత్రం దిఘా వద్ద తీరం దాటిన సూపర్‌ సైక్లోన్‌.. ఒడిశా, పశ్చిమ బంగాల్ రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. భారీ వర్షాలకు ప్రచండ గాలులు తోడై, ఆ రెండు రాష్ట్రాలను చిగురుటాకుల్లా వణికించాయి. ముఖ్యంగా కోల్‌కతా నగరం రూపురేఖలే మారిపోయాయి.

సహాయక బృందాలకు సెల్యూట్​

150కిమీకుపైగా వేగంతో పెను గాలులు వీచడం వల్ల నగరంలోని రోడ్లపై ఎక్కడ చూసినా నేలకూలిన చెట్లే కనిపిస్తున్నాయి. సెల్‌టవర్లు దెబ్బతినడం వల్ల సమాచార వ్యవస్థ నిలిచిపోయింది. దీంతో పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రోడ్లపై పడిన చెట్లు, స్తంభాలను తొలగిస్తున్నారు. అనేక చోట్ల ఇళ్లు, వాహనాలపై భారీ వృక్షాలు కూలిపడ్డాయి. దీంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. విపత్తు సమయంలో కోల్‌కతా పోలీసుల పనితీరును గంగూలీ ప్రశంసించాడు. రోడ్లపై పడిన చెట్లను తొలగిస్తున్న వీడియోలు పంచుకున్న దాదా వారిని అభినందించారు.

ఇదీ చూడండి.. 'నా తల పోయింది.. ఎవరికైనా దొరికిందా?'

ABOUT THE AUTHOR

...view details