గుండెపోటుతో శనివారం ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు దాదాకు చేసిన యాంజియోప్లాస్టీ విజయవంతమైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు స్పష్టం చేశారు కోల్కతా వుడ్ ల్యాండ్స్ ఆస్పత్రిలోని డాక్టర్ అఫ్తబ్ ఖాన్. మరో 24గంటల పాటు గంగూలీని వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని అన్నారు.
దాదాకు యాంజియోప్లాస్టీ విజయవంతం - గంగూలీ ఆరోగ్యం నిలకడ
గుండెపోటుకు గురైన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి చేసిన యాంజియోప్లాస్టీ విజయవంతమైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు స్పష్టం చేసిన వైద్యులు.. మరో 24గంటల పాటు వైద్య పర్యవేక్షణలో ఉంచుతామని చెప్పారు.
గంగూలీ
శుక్రవారం సాయంత్రం గంగూలీ వ్యాయామం చేస్తుండగా ఛాతి నొప్పితో అసౌకర్యానికి గురయ్యారు. శనివారం మధ్యాహ్నం కూడా ఆయన ఇబ్బంది పడటం వల్ల కుటుంబ సభ్యులు వెంటనే కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆసుపత్రిలో చేర్చారు. స్వల్ప స్థాయి గుండెపోటు రావడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు నిర్ధారించారు.
ఇదీ చూడండి : ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ