తెలంగాణ

telangana

By

Published : Oct 23, 2019, 2:47 PM IST

Updated : Oct 23, 2019, 3:05 PM IST

ETV Bharat / sports

జట్టులానే బీసీసీఐని నడిపిస్తా.. కోహ్లీని రేపు కలుస్తా

బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సౌరభ్ గంగూలీ.. మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించాడు. కెప్టెన్​ కోహ్లీని గురువారం కలుస్తానని అన్నాడు.

సౌరభ్ గంగూలీ

భారత క్రికెట్ నియంత్రణ మండలి నూతన అధ్యక్షుడిగా బుధవారం.. బాధ్యతలు స్వీకరించాడు సౌరభ్ గంగూలీ. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో తానేం చేయబోతున్నాడో చెప్పాడు. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా ఉన్న బీసీసీఐని అవినీతికి తావులేకుండా నడిపిస్తానని అన్నాడు.

"బీసీసీఐ విశ్వసనీయత కోల్పోకుండా, అవినీతికి తావులేకుండా బాధ్యతలు నిర్వర్తిస్తాను. భారత జట్టును నడిపించినట్లే అధ్యక్షుడిగా పనిచేస్తాను" -సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

39వ బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన దాదా.. 9 నెలల పాటు ఈ పదవిలో ఉండనున్నాడు. అదేవిధంగా భారత కెప్టెన్ కోహ్లీతో గురువారం భేటీ అవుతానని చెప్పాడు గంగూలీ.

బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సౌరభ్ గంగూలీ

"భారత క్రికెట్​లో కోహ్లీ అత్యంత ముఖ్యమైన వ్యక్తి. అతడి మాటలను మేం వింటాం. పరస్పరం గౌరవం ఉంది. రేపు(గురువారం) విరాట్​తో మాట్లాడుతా. బోర్డు తరఫున అతడికి అన్ని విధాలుగా సహాయపడతాం" -సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

ఇది చదవండి: విజయాల సారథి.. శతకాల వారధి.. ఈ సవ్యసాచి!: సౌరభ్ గంగూలీ ప్రత్యేక కథనం

Last Updated : Oct 23, 2019, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details