కరోనాను ఈ ఏడాది చివరికి లేదా, 2021 ప్రారంభం వరకు భరించాల్సి ఉంటుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఇటీవలే ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో ఆన్లైన్ సెషన్లో మాట్లాడిన గంగూలీ.. కరోనా పరిస్థితులపై అనేక విశేషాలు పంచుకున్నాడు.
"రానున్న నాలుగు నెలలు కాస్త కఠినంగా ఉంటాయని అనుకుంటున్నా. కచ్చితంగా మనం భరించి తీరాల్సిందే. వచ్చే ఏడాదికి పరిస్థితులన్నీ సాధారణ స్థితికి రావాలి. టీకా వచ్చే వరకు వేచి చూడక తప్పదు. అప్పటి వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవ్వరూ ఈ మహమ్మారి బారిన పడాలని అనుకోవట్లేదు. ఆటలో లాలాజలం వినియోగం ఒక సమస్య. టీకా వచ్చిన తర్వాతే అన్నీ సాధారణ స్థితికి వస్తాయి."