తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత క్రికెట్​కు గంగూలీ, ద్రవిడ్​ భాగస్వామ్యం ముఖ్యం' - బీసీసీఐ

భారత క్రికెట్​ మరింత మెరుగుపడటానికి గంగూలీ, ద్రవిడ్​ల భాగస్వామ్యం సహకరిస్తుందని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్​ వీవీఎస్​ లక్ష్మణ్​. క్రికెట్​ పరిపాలనా విభాగంలో గంగూలీ, ద్రవిడ్​ల ప్రాముఖ్యాన్ని వివరించాడు.

Ganguly-Dravid partnership important for Indian cricket, says Laxman
'భారత క్రికెట్​కు గంగూలీ, ద్రవిడ్​ భాగస్వామ్యం ముఖ్యం'

By

Published : Jun 26, 2020, 10:28 PM IST

ఆటగాళ్లుగా కలిసి అంచెలంచెలుగా ఎదిగిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, జాతీయ క్రికెట్​ అకాడమీ ఛైర్మన్​ రాహుల్​ ద్రవిడ్​.. ప్రస్తుతం కీలక పదవుల్లో ఉన్నారు. వీరిద్దరి భాగస్వామ్యం రాబోయే రోజుల్లో భారత క్రికెట్​ మెరుగుపడటానికి ఎంతగానో ఉపయోగపడుతుందని​ ఆశాభావం వ్యక్తం చేశాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ వీవీఎస్​ లక్ష్మణ్. క్రికెట్​ పరిపాలనా విభాగంలో గంగూలీ, ద్రవిడ్​ల ప్రాముఖ్యాన్ని వివరించాడు​.

రాహుల్​ ద్రవిడ్​, సౌరవ్​ గంగూలీ

"బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ, నేషనల్​ క్రికెట్​ అకాడమీ హెడ్​ రాహుల్​ ద్రవిడ్​ల భాగస్వామ్యం చాలా బాగుంటుంది. ప్రతి ఫార్మాట్​లోనూ భారత జట్టు విజయవంతం కావాలంటే వీరిద్దరి భాగస్వామ్యం చాలా చాలా ముఖ్యం. కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు, ఎన్​సీఏ హెడ్ అందరూ ప్రధానమే".

- వీవీఎస్​ లక్ష్మణ్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

లార్డ్స్​ వేదికగా 1996లో జరిగిన మ్యాచ్​లో ద్రవిడ్​ సెంచరీ కోసం బాల్కనీ నుంచి ఎంతో ఆత్రుతగా ఎదురచూశానని ఇంటర్వ్యూలో వెల్లడించాడు గంగూలీ. ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు మ్యాచ్​లో 301 బంతులను ఎదుర్కొని గంగూలీ 131 పరుగులు చేయగా.. ద్రవిడ్​ 267 బంతుల్లో 95 పరుగులతో సెంచరీ మిస్సయ్యాడు. ఈ మ్యాచ్​ డ్రాగా ముగిసింది.

"జట్టు విజయం కోసం నా పనితీరులో నేను మునిగిపోయా. ద్రవిడ్​ క్రీజ్​లోకి వచ్చినప్పుడు, నేను అప్పటికే 70 పరుగులు​ చేశా. నా వందో పరుగు కోసం కొట్టిన షాట్​ నాకింకా గుర్తుంది. ఆ సమయంలో ద్రవిడ్​ నాన్​స్ట్రైక్​ ఎండ్​లో ఉన్నాడు. ఆ మ్యాచ్​లో 131 రన్స్​తో వెనుదిరిగా. ఆ తర్వాతి రోజు ద్రవిడ్​ 95 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అప్పుడు లార్డ్స్​ బాల్కనీలో నిల్చొని తన సెంచరీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశా. అండర్​-15లో ద్రవిడ్​ను తొలిసారి చూశా. ఆ తర్వాత రంజీలో ఇద్దరం కలిసి ఆడాం. ఈడెన్​ గార్డెన్స్​, లార్డ్స్​లోనూ తన ప్రదర్శన చూశా. కానీ, ఆ రోజు ఇద్దరం సెంచరీలు సాధించుంటే బాగుండేది" అని ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు గంగూలీ.

ఇదీ చూడండి...'ప్రభుత్వం అనుమతిస్తే హైదరాబాద్​లో శిక్షణ ప్రారంభం'

ABOUT THE AUTHOR

...view details