భారత మాజీ సారథి సౌరభ్ గంగూలీ.. ఓ సందర్భంలో తమ డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి మైదానంలో జరిగిన ఓ గొడవను పెద్దది చేయొద్దని కోరాడని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర చెప్పాడు. లంకతో 2002 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా మైదానంలో రసెల్ ఆర్నాల్డ్‌తో వాగ్వాదానికి దిగిన నేపథ్యంలో దాదా ఇలా చేశాడని గుర్తు చేసుకున్నాడు.
"ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆర్నాల్డ్‌తో గంగూలీ వాగ్వావాదానికి దిగాడు. అతన్ని చివరగా ఓ సారి హెచ్చరించిన అంపైర్ ఆఖరికి రిఫరీకి ఫిర్యాదు చేశాడు. ఈ స్థితిలో దాదా మా డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చి మాట్లాడాడు. 'మీరు ఈ వివాదాన్ని కొనసాగిస్తే ఎక్కడికో వెళ్లిపోతుంది. నాపై సస్పెన్షన్ కూడా పడొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని పెద్దది చేయద్దు' అని కోరాడు. మేం అలా చేయబోమని అతనికి చెప్పాం" అని సంగ చెప్పాడు.