తెలంగాణ

telangana

ETV Bharat / sports

'దాదా, ధోనీ మధ్య చాలా పోలికలున్నాయి' - Ganguly and Dhoni both have same qualities says Zaheer khan

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్లు సౌరభ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీలపై ప్రశంసల జల్లు కురిపించాడు మాజీ పేసర్ జహీర్ ఖాన్. వీరిద్దరూ జట్టు ఛాంపియన్​గా నిలవడానికి దోహదం చేశారని అన్నాడు.

జహీర్
జహీర్

By

Published : Apr 16, 2020, 6:07 PM IST

టీమ్‌ఇండియాలో యువకులను ప్రోత్సహించే పద్ధతిలో మాజీ సారథులు సౌరభ్‌ గంగూలీ, మహేంద్రసింగ్‌ ధోనీల మధ్య చాలా పోలికలున్నాయని మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్‌ అన్నాడు. గంగూలీ సారథ్యంలో టీమ్‌ఇండియాకు ఎంపికైన జహీర్‌.. ధోనీ కెప్టెన్సీలోనూ తనదైన ముద్రవేశాడు. ఇద్దరు దిగ్గజాలతో కలిసి ఆడిన అనుభవమున్న మాజీ పేసర్‌ వారి మధ్య చాలా పోలికలున్నాయన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడిన జహీర్ భారత క్రికెట్‌లో ప్రతి దశాబ్దానికి ఒక అత్యుత్తమ కెప్టెన్‌ నుంచి మరో అత్యుత్తమ కెప్టెన్‌ జట్టు పగ్గాలు అందుకుంటాడని చెప్పాడు.

"గంగూలీ సారథ్యంలో జట్టులోకి చేరిన నాకు మంచి సహకారం లభించింది. దాదా ప్రోత్సాహం వల్లే నా కెరీర్ మలుపు తిరిగింది. జట్టులో ఎంతో మంది సీనియర్లు ఉండగా ధోనీ టీమ్‌ఇండియా సారథిగా ఎంపికయ్యాడు. సీనియర్లు తప్పుకొంటున్న క్రమంలో అతడు యువకులను ప్రోత్సహించాడు. గంగూలీ లాగే ధోనీ కూడా యువ ఆటగాళ్లను వెన్నుతట్టి ప్రోత్సహించాడు. గంగూలీ భారత క్రికెట్‌ రూపురేఖల్ని మార్చి యువకులను మ్యాచ్‌ విన్నర్లుగా తీర్చిదిద్దితే.. ధోనీ అక్కడి నుంచి టీమ్‌ఇండియాను ప్రపంచ ఛాంపియన్‌గా తీర్చిదిద్దాడు."

-జహీర్ ఖాన్, టీమ్​ఇండియా మాజీ పేసర్

ఏ క్రికెటర్‌కైనా కెరీర్‌ ఆరంభంలో మంచి సహకారం అవసరమని, అది దొరికాక కెరీర్‌ను మలుపు తిప్పుకోవడం వారి బాధ్యతేనని జహీర్‌ అన్నాడు. సరైన సమయంలో అలా కెప్టెన్‌ మద్దతు దొరకడమే అన్నింటికన్నా ముఖ్యమని వెల్లడించాడు. తన విషయంలో గంగూలీ నుంచి మంచి సహకారం లభించిందని వివరించాడు. దాదా, ధోనీ టీమ్‌ఇండియాను ఏళ్లపాటు ముందుండి నడిపించారన్నాడు.

ABOUT THE AUTHOR

...view details