ఇంగ్లండ్‌లో జూన్ 16న జరగాల్సి ఉన్న భారత్-పాక్ వరల్డ్‌కప్ మ్యాచ్‌పై గౌతమ్ గంభీర్ స్పందించాడు. సాధారణంగా దేశంలో జరిగే ఘటనలపై ఎప్పుడూ తనదైన శైలిలో స్పందించే ఆటగాళ్లలో గంభీర్ ఒకడు. పుల్వామా దాడిలో జవాన్ల కుటుంబాలకు మద్దతుగా నిలిచిన ఈ మాజీ ఆటగాడు...దేశానికే తొలి ప్రాధాన్యం ఇస్తానంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
'పాకిస్థాన్, భారత్ మధ్య మ్యాచ్ నిర్వహించాలా వద్దా అనేది బీసీసీఐ నిర్ణయం. నా వ్యక్తిగత ఆలోచన అయితే ఆట వదులుకోవడంలో తప్పేం లేదు. ఆ మ్యాచ్ ద్వారా వచ్చే రెండు పాయింట్లు అంత ముఖ్యమని భావించడం లేదు. భారత క్రికెట్‌కు ఈ విషయంలో ప్రజల మద్దతు అవసరం. నా దృష్టిలో క్రికెట్ కంటే జవాన్ల త్యాగం గొప్పది. అందుకే దేశానికే తొలి ప్రాధాన్యం ఇస్తా'.
-గౌతమ్ గంభీర్, భారత మాజీ క్రికెటర్
- ఐపీఎల్లో కామెంటర్‌గా...