తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సైనీ.. నీ ప్రదర్శనతో వారికి బుద్ధి చెప్పావ్' - చేతన్ చౌహాన్

వెస్టిండీస్​తో జరిగిన టీ20 మ్యాచ్​లో టీమిండియా బౌలర్ నవదీప్​ సైనీ మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​గా నిలిచాడు. ఎంతో ప్రతిభ ఉన్న సైనీని జట్టులోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకు భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ, చేతన్ చౌహాన్​లపై గౌతమ్ గంభీర్ మండిపడ్డాడు.

గౌతమ్ గంభీర్

By

Published : Aug 4, 2019, 4:37 PM IST

శనివారం విండీస్‌పై భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమిండియా బౌలర్ సైనీ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఈ యువ ఆటగాడిని జట్టులోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన బేడీ, చేతన్​లను ట్విట్టర్ వేదికగా మాజీ ఓపెనర్ గంభీర్ విమర్శించాడు.

"సైనీ.. నువ్వు బౌలింగ్‌ చేయకముందే బేడీ, చేతన్‌ల వికెట్లు తీశావు. నీ అరంగేట్ర మ్యాచ్‌ చూసి వారిద్దరి మిడిల్‌ స్టంప్స్‌ ఎగిరిపడ్డాయి" అని గంభీర్ ట్వీట్ చేశాడు.

నవదీప్​ సైనీ

రంజీ జట్టులోకి సైనీని తీసుకురావడానికి గంభీర్ నిర్ణయించుకున్నాక, హరియాణాకు చెందిన వ్యక్తిని ఎలా ఆడిస్తారంటూ బేడీ, చేతన్ వ్యతిరేకించారు. దిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్న వారిద్దరూ బయటి వ్యక్తిని దిల్లీ జట్టులోకి తీసుకురావడాన్ని ప్రశ్నించారు.

బేడీ, చౌహాన్​లను గంభీర్ వ్యతిరేకించడం ఇదే మెుదటిసారి కాదు. గతేడాది అఫ్గాన్​తో జరిగిన టెస్టుకు సైనీ భారత జట్టులో చేరినప్పుడు ఇదే విధంగా వ్యాఖ్యానించాడు. ఈ టెస్టులో సైనీ ఆడలేదు.
తన విజయానికి కారణమైన గంభీర్​, మరికొందరు సీనియర్ ఆటగాళ్లకు రుణపడి ఉంటానని సైనీ ఇంతకు ముందే చెప్పాడు.

ఇది సంగతి: సచిన్​-కాంబ్లీ ఫ్రెండ్​షిప్​ డే థియరీ సూపర్​

ABOUT THE AUTHOR

...view details