తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ వల్ల జీవితాంతం వేదన మిగిలింది: గంభీర్​ - gambhir 97 runs

మహేంద్రసింగ్ ధోనీ వల్ల 2011 ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీ కోల్పోయనని అన్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. తాను చేజార్చుకున్న ఆ మూడు పరుగులు జీవితాంతం గుర్తుండిపోతాయని అన్నాడు.

గంభీర్

By

Published : Nov 18, 2019, 8:05 AM IST

Updated : Nov 18, 2019, 4:17 PM IST

2011 ప్రపంచకప్ ఫైనల్.. గౌతమ్​ గంభీర్​ మూడు పరుగులు చేస్తే సెంచరీ పూర్తి అవుతుంది. అయితే ధోనీ వల్ల తన శతకం కోల్పోయానని అంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ . 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సెంచరీ చేయాలని మహీ గుర్తుచేశాడని, అనంతరం ఏకాగ్రత కోల్పోయి ఔటయ్యానని చెప్పాడు గంభీర్.

ధోనీ వల్ల జీవితాంతం వేధన మిగిలింది: గంభీర్​

"శ్రీలంకతో 2011 వరల్డ్​కప్​ ఫైనల్లో 97 పరుగుల వ్యక్తిగత స్కోరుకు చేరినా.. నా మనసులో లక్ష్యమే కదలాడుతోంది. సెంచరీకి నేను చేయాల్సింది మూడు పరుగులేనని ధోనీ గుర్తు చేశాడు. అప్పటి వరకు నా స్కోరు ఎంత అని.. ఇంకో మూడు పరుగులు చేస్తే శతకం చేస్తాననే సంగతే పట్టించుకోలేదు. ధోనీ అలా చెప్పిన తర్వాత సెంచరీ పూర్తి చేసే తొందరలో తిసార పెరీరా బౌలింగ్‌లో దూకుడుగా ఒక షాట్‌ ఆడబోయి బౌల్డ్‌ అయ్యా." - గౌతమ్​ గంభీర్​, టీమిండియా మాజీ ఓపెనర్.

ఆ మూడు పరుగులు జీవితాంతం వేదిస్తాయని అన్నాడు గంభీర్.

"తొందరపాటులో 3 పరుగులు చేయలేక సెంచరీ కోల్పోవడం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఇప్పటికీ చాలామంది ప్రపంచకప్‌ ఫైనల్లో ఆ మూడు పరుగులు ఎందుకు చేయలేదు అని అడుగుతుంటారు" - గౌతమ్​ గంభీర్.

గంభీర్‌ ఔటైనా.. ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేసిన ధోనీ.. 91 పరుగులతో అజేయంగా నిలిచి 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు రెండో ప్రపంచకప్‌ను అందించిన సంగతి తెలిసిందే. 97 పరుగుల వద్ద ఔటైనప్పటికీ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు గంభీర్.

ఇదీ చదవండి: క్యాచ్​ పట్టబోతే.. ఆటగాడి ముక్కు పగిలింది..!

Last Updated : Nov 18, 2019, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details