ఓ టీ20 మ్యాచ్‌ను నాలుగు ఇన్నింగ్స్‌లుగా విభజించాలనే ఆలోచన సరికాదని అభిప్రాయపడ్డారు మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, బ్రెట్‌లీ. ఈ పద్ధతికి తాము వ్యతిరేకమని చెప్పారు.
టీ20 మ్యాచ్‌ల్లో నాలుగు ఇన్నింగ్స్‌లా? - బ్రెట్‌లీ తాజా వార్తలు
పొట్టి ఫార్మాట్లోని మ్యాచ్‌ల్లో నాలుగు ఇన్నింగ్స్‌లు పెట్టాలన్న ఆలోచన సరైదని కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు మాజీ ఆటగాళ్లు గంభీర్, బ్రెట్‌లీ.
![టీ20 మ్యాచ్‌ల్లో నాలుగు ఇన్నింగ్స్‌లా? ఐపీఎల్‌లోని ఓ దృశ్యం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7060984-523-7060984-1588605040566.jpg)
టీ20ల్లో నాలుగు ఇన్నింగ్స్‌లు
"టీ20 ఇన్నింగ్స్‌ను రెండుగా విభజించడం సరైన నిర్ణయం కాదు. సచిన్ చెప్పినట్లు వన్డేలో ఈ ఆలోచన విజయం కావొచ్చేమో కానీ పొట్టి ఫార్మాట్‌కు ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇందులో ఉండేదే అతి తక్కువ సమయం. అందులోనూ రెండు ఇన్నింగ్స్‌లు ఉంటే, ఆటకు అది ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చదు" -గౌతమ్ గంభీర్, భారత మాజీ క్రికెటర్
ఇదే విషయంపై మాట్లాడిన మాజీ బౌలర్ బ్రెట్‌లీ.. నాలుగు ఇన్నింగ్స్‌లు ఆలోచన సరికాదని అన్నాడు. క్రికెట్లో కొన్ని సంప్రదాయ పద్ధతుల్ని అలానే ఉంచాలని చెప్పాడు.