టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. తన ఇంట్లో ఓ వ్యక్తికి కరోనా సోకడం వల్ల క్వారంటైన్‌కు వెళ్లినట్లు తెలిపారు. తన వైద్యపరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు.
"మా ఇంట్లో ఓ వ్యక్తికి కరోనా రావడం వల్ల నేను ఐసోలేషన్లోకి వెళ్లాను. నా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాను. ఈ మహమ్మారిని తేలికగా తీసుకోవద్దు. అందరూ మార్గదర్శకాలను పాటించాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి."